ఈ వారం థియేటర్లో సందడి చేసే సినిమాలు ఇవే

-

గత నెల రోజులుగా బాక్సాఫీస్‌ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలేం లేవు. దాదాపు నెల రోజులుగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఒక్క టిల్లు స్క్వేర్ తప్ప ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలేం లేవు. అయితే మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి థియేటర్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన చిత్రాలు, వాటి విశేషాలంటో ఓసారి చూసేద్దామా?

‘ఆ ఒక్కటీ అడక్కు’ .. అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రసన్నవదనం.. సుహాస్‌ ఆయన కీలక పాత్రలో అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో  అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.

బాక్‌.. సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. దీన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

జితేందర్‌రెడ్డి.. ‘ఉయ్యాల జంపాల’తో యువతను ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘జితేందర్‌రెడ్డి’. ‘బాహుబలి’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే కథానాయకుడు.ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version