టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్‌స్టార్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణ కటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అయితే.. సినిమాల్లో ఎంతో రాణించిన కృష్ణ గారి సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ
1943 మే 31న జన్మించిన కృష్ణ
తెలుగునాట 325 పై చిలుకు చిత్రాల్లో నటించిన కృష్ణ
కృష్ణ తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘కులగోత్రాలు’
కృష్ణ హీరోగా కనిపించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’
సోలో హీరోగా కృష్ణ నటించిన మొదటి సినిమా ‘గూఢాచారి 116’
కృష్ణ ఎక్కువ చిత్రాల్లో నటించిన నాయిక విజయనిర్మల
కృష్ణ- విజయనిర్మల నటించిన తొలి చిత్రం ‘సాక్షి’
కృష్ణ తొలి కౌబోయ్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’
యన్టీఆర్ తో కృష్ణ నటించిన తొలి చిత్రం ‘స్త్రీ జన్మ’
ఏయన్నార్ అల్లునిగా కృష్ణ సినిమా ‘మంచి కుటుంబం’
కృష్ణ తొలి సొంత చిత్రం ‘అగ్నిపరీక్ష’
కృష్ణకు స్టార్ డమ్ సంపాదించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’
కృష్ణ, శోభన్ బాబు నడుమ సాగిన బాక్సాఫీస్ వార్!
మల్టీస్టారర్స్ లో ఏకైక గోల్డెన్ జూబ్లీ కృష్ణ-శోభన్ ‘ముందడుగు’
కృష్ణ 100వ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’
కృష్ణ 200వ చిత్రం ‘ఈ నాడు’
కృష్ణ 300వ చిత్రం ‘తెలుగు వీర లేవరా!’
తెలుగులో తొలి కలర్ – సినిమాస్కోప్ ‘అల్లూరి సీతారామరాజు’
తెలుగులో మొదటి 70 ఎమ్.ఎమ్. మూవీ ‘సింహాసనం’
తెలుగులో తొలి టెక్నోవిజన్ మూవీ ‘దొంగల దోపిడి’
కృష్ణ చివరి సారి కనిపించిన చిత్రం ‘శ్రీ శ్రీ’