బాహుబలి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్ళే..!!

-

రాజమౌళి సినీ కెరియర్ లోని మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది . రాజమౌళి వల్లే తెలుగు సినీ పరిశ్రమకు మరింత గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. ఈతరం సినిమాలలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను కొంతమంది స్టార్ సెలబ్రిటీలకు కూడా మిస్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే బాహుబలి సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కథను రాసేటప్పుడు కొన్ని పాత్రలను ప్రత్యేకంగా అనుకోని మరి కథను తెరకెక్కించారు రాజమౌళి.ఆ పాత్రల కోసం కొంతమందిని ప్రత్యేకంగా వెళ్లి మరీ నటించమని కోరగా కొంతమంది కాల్ షీట్లు లేక వదులుకుంటే .. మరికొంతమంది పారితోషకం డిమాండ్ చేసి సినిమాను వదులుకున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి సినిమాను వదులుకున్న స్టార్ సెలబ్రిటీల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

శ్రీదేవి:ఈ సినిమాలో అత్యంత కీలకపాత్ర శివగామి అని చెప్పవచ్చు. ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి శ్రీదేవిని సంప్రదించారు.కానీ ఆమె పారిపోషకం ఎక్కువ డిమాండ్ చేయడంతో పాటు కొన్ని వసతులు కూడా అధికంగా కేటాయించాలని డిమాండ్ చేసింది. దానితో బడ్జెట్ గురించి ఆలోచించిన రాజమౌళి వెనక్కు తగ్గి ఆ ప్లేస్లో రమ్యకృష్ణను తీసుకురావడం జరిగింది. ఇక ఆ రమ్యకృష్ణ ఏ రేంజ్ లో ఆ పాత్రకు న్యాయం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.

మంచు లక్ష్మి:


శివగామి పాత్ర కోసం మంచు లక్ష్మిని సంప్రదించారట. కానీ ప్రభాస్ కి తల్లి పాత్ర అనేసరికి తాను చేయలేనని చెప్పుకొచ్చింది.అలా బాహుబలి సినిమా మిస్ చేసుకుందట మంచు లక్ష్మి.

అమితాబ్ బచ్చన్:సినిమాలో మరొక కీలకపాత్ర కట్టప్ప. ఆ పాత్రలో సత్యరాజ్ నటించిన విషయం తెలిసిందే. ఇందులో ముందుగా జక్కన్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను అనుకున్నారు కానీ ఆయన నో చెప్పడంతో ఈ ఆఫర్ సత్యరాజ్ ను వరించింది.

జాన్ అబ్రహం:
ఇక బాహుబలితో తలపడే విలన్ బల్లాలదేవ్ పాత్ర కోసం రాజమౌళి జాన్ అబ్రహంను కూడా అనుకున్నారు. కానీ ఆ పాత్రకు రానా నే సెట్ అవుతాడని అతడినే ఎంపిక చేయడం జరిగింది.

సూర్య:
బాహుబలి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సూర్యను సంప్రదించారట .సికిందర్ సినిమా ప్రమోషన్ సమయంలో ఈ విషయాన్ని సూర్య స్వయంగా వెల్లడించారు. కానీ ఆ ఛాన్స్ వదులుకున్న తర్వాత తాను ఎంతో బాధపడ్డాను అని కూడా తెలిపాడు.

సోనం కపూర్:


అవంతిక పాత్ర కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ సంప్రదించారట . కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆఫర్ తమన్నాకు దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version