అధికారిక ప్రకటన తర్వాత ఆగిపోయిన మహేశ్ బాబు సినిమాలివే..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్..దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఫిల్మ్ కోసం రాజమౌళి స్టోరి రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన మహేశ్ ‘సర్కారు వారి పాట’ పిక్చర్ అభిమానులకు బాగా నచ్చింది. మరో వైపున తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 చిత్రంపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది.

ఈ సంగతులు పక్కనబెడితే…మహేశ్ కెరీర్ లో కొన్ని సినిమాలు అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆగిపోయాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు ప్రొడ్యూసర్ గా ఓ సినిమా స్టార్ట్ చేశారు. దీనికి ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ, ఈ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

ఇక క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘శివమ్’ అనే టైటిల్ తో మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారని అప్పట్లో సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఫిమేల్ లీడ్ గా ఫిక్స్ చేశారు. కానీ, తర్వాత ఈ మూవీ ఆగిపోయింది.

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం-మహేశ్ బాబు కాంబోలోనూ ఓ పిక్చర్ ప్రకటించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేకపోయింది. హేమందర్ దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేశ్ హీరోగా ‘మిర్చి’ అనే టైటిల్ తో ఫిల్మ్ అనౌన్స్ చేశారు. కానీ, అది కూడా రియాలిటీలోకి రాలేదు. ఈ టైటిల్ తో దర్శకుడు కొరటాల శివ సినిమా చేసేశాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే టైటిల్ తో మహేశ్ సినిమా రాబోతున్నదని వార్తలొచ్చాయి. కానీ, అది ఉట్టి వార్తగానే మిగిలిపోయింది. ఇక పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ మహేశ్ తో చేస్తానని అన్నారు. స్టోరి లైన్ కూడా మహేశ్ కు వినిపిస్తే ..ఇంకా వర్క్ చేయమన్నారని తెలిపారు. కాగా, చివరకు ఆ సినిమా మహేశ్ కు లభించలేదు. సేమ్ స్టోరిని పూరీ జగన్నాథ్ ప్రజెంట్..విజయ్ దేవరకొండతో అదే టైటిల్ ‘జన గణ మన(జేజీఎం)’గా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version