నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా డాకు మహారాజ్. ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన రిలీజ్ అయి.. చరిత్ర సృష్టిస్తోంది డాకు మహారాజు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన నేపథ్యంలో… చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అనంతపురంలో సక్సెస్ మీట్ నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇవాళ అనంతపురం నడిబొడ్డున డాకు మహారాజు విజయోత్సవ సభ ఉంటుంది.

అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 6:30 గంటలకు ఈవెంట్ జరుగుతుంది. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ కు నందమూరి బాలయ్య కూడా హాజరు కాబోతున్నారు. వాస్తవానికి అనంతపురంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవాలని ముందుగా అనుకున్నారు. కానీ అప్పుడే తిరుమల తొక్కిసలాట జరగడంతో వెనక్కి తగ్గింది చిత్ర బృందం. ఇక ఇప్పుడు సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది.