పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. పోలీసుతో వివాహం

-

ఒకప్పుడు హీరోయిన్లు సరైన వయసులో పెళ్లి చేసుకోవాలంటే ఆఫర్లు వస్తాయో రావోనని భయపడి లేటు వయసులో పెళ్లి చేసుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రొఫెషనల్ లైఫ్​కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. పర్సనల్ లైఫ్​కు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే నచ్చినవాడు దొరకగానే మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. అలా తాజాగా టాలీవుడ్ బ్యూటీ చిత్ర శుక్లా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఈ భామ ఓ పోలీస్ అధికారిని వివాహం చేసుకోబోతోంది. మరో రెండ్రోజుల్లో ఈ భామ పెళ్లి జరగబోతోంది. ఈ నేపథ్యంలో తన ఎంగేజ్​మెంట్, ఇతర ఈవెంట్లకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.

మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్రశుక్లా 2014లో ‘ఛల్ భాగ్’ అనే హిందీ మూవీతో తెరంగేట్రం చేసింది. 2016లో వచ్చిన ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్​కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత శ్రీవిష్ణుతో కలిసి ‘మా అబ్బాయి’ సినిమాతో పూర్తి స్థాయిలో హీరోయిన్​ అయ్యింది. ఆ తర్వాత ‘రంగుల రాట్నం’, ‘సిల్లీ ఫెలోస్’, ‘తెల్లవారితే గురువారం’, ‘పక్కా కమర్షియల్’, ‘ఉనికి’ అనే సినిమాల్లో నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version