డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముగ్గురు యువకులు సెల్ టవర్ ఎక్కారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు అరెస్టు చేసిన తమ గ్రామస్తులను వెంటనే విడుదల చేయాలని లేదంటే కిందకు దూకుతామని ఆ యువకులు బెదిరింపులకు దిగారు.
ఇదిలాఉండగా, సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారానగర్ గ్రామాల్లో డంప్ యార్డుకు వ్యతిరేకంగా అక్కడి గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. డంప్ యార్డు ఏర్పాటు చేయడం వలన గ్రామాల్లోని ప్రజలు తరచూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తోందని వారు ఆందోళన చేపట్టారు.ఈ క్రమంలోనే నల్లపల్లి,ప్యారా నగర్ గ్రామాల్లోని ప్రజలు నిరసనతో పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది.