కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ అనేక సినిమాలలో నటించి తన సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు. స్టార్ హీరోలు అందరిలో హీరో ధనుష్ ముందు వరుసలో ఉంటారు. ఈ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనుష్ సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు పండగ జరుపుకుంటారు. ఇక ధనుష్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
ఇక గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ధనుష్ మరో వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కొద్ది రోజుల నుంచి ఈ హీరో టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ధనుష్ ఇన్ స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నారు. ఓ బీచ్ వద్ద నిల్చోని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ ”అనుకోని సంఘటనలు అద్భుతాలను సృష్టిస్తాయని” క్యాప్షన్ జత చేశాడు. దీంతో ధనుష్ ఈ పోస్టును మృనాల్ ఠాకూర్ కోసమే పెట్టాడని అంటున్నారు. తొందరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెడతారని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.