ఇండస్ట్రీలో విషాదం.. అజిత్ తండ్రి మృతి..!

-

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి . కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తండ్రి సుబ్రమణియన్ ఈరోజు ఉదయం చెన్నైలో తన నివాసంలో తుదిస్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి అజిత్ ఒక్కసారిగా కృంగిపోతున్నారని తెలుస్తోంది. తన తండ్రి అంటే ఎనలేని అభిమానం, గౌరవం పెంచుకున్న అజిత్ తన తల్లిదండ్రులకు చెప్పకుండా ఏ పని చేసేవారు కాదట. అలాంటి తండ్రి భవిష్యత్తు మార్గాన్ని చూపించే ఆయన మరణించడం నిజంగా బాధాకరమని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇక అజిత్ తండ్రి మరణానికి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే తండ్రి మరణ వార్త నుంచి త్వరగా కోలుకోవాలని అజిత్ ను పరామర్శిస్తున్నారు. ఇకపోతే అజిత్ అభిమానులు తమ అభిమాన హీరో పితృవియోగం చెందడంతో మరింత దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల తునివు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఇప్పుడు తన 62వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

గతంలో విజ్ఞేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని.. నయనతార హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపించినా.. విఘ్నేష్ ను సినిమా నుంచి తప్పించడంతో హర్ట్ అయిన నయనతార కూడా సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఈ సినిమాకు వేరొక దర్శకుడిని కన్ఫామ్ చేశారు మేకర్స్. అలాగే ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఆయనకు ఏ విధమైన ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version