చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.
అయితే తాజాగా తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి పి సుబ్రహ్మణ్యం కన్నుమూచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం మరణించినట్లు సమాచారం అందుతుంది. కాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు దుబాయ్ వెళ్లిన అజిత్ కుమార్… తన తండ్రి మరణ వార్త తెలిసి… తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకా ఇవాళ రాత్రి సమయంలో అజిత్ తండ్రి అంతక్రియలు జరగనున్నాయి.