Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం… వడ్డేపల్లి కృష్ణ ఇకలేరు!

-

Vaddepalli Krishna is no more: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కవి, లలిత సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వడ్డేపల్లి కృష్ణ వయసు 76 సంవత్సరాలు. గొప్ప లలిత గీతాల రచయితను తెలంగాణ ప్రభుత్వం కోల్పోయింది. గత రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం కృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడం జరిగింది.

Tragedy in the Tollywood industry Vaddepalli Krishna is no more

అమెరికా అటా వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన కృష్ణ ఆరోగ్యం దెబ్బతినడంతో జులై 16వ తేదీన హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరడం జరిగింది. నెల రోజులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ గత నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి వెళ్లారు. గురువారం రోజున ఆరోగ్యం కాస్త ఇబ్బంది అనిపించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతతో తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తపాలా శాఖలో ఉద్యోగం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version