Trisha: అందంగా కనిపించడం కోసం త్రిష ఇంజక్షన్స్ తీసుకుంటోందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో 20 సంవత్సరాలుగా స్టార్ పొజిషన్ లో కొనసాగుతూ మళ్లీ అదే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంటున్న త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందాల ముద్దుగుమ్మ అందాల తార ఎంతో మంది యువత కలల రాకుమారి త్రిష.. సిమ్రాన్ , ప్రశాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన జోడి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మోడలింగ్ లో రాణించి, మిస్ చెన్నై పోటీ గెలవడంతో సినిమాలలో అవకాశాలు లభించాయి. తమిళంలో వరుస సినిమాలు చేసి భారీ హిట్ అందుకున్న త్రిష ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ద్వారా పరిచయమై ఈ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా చేతినిండా అవకాశాలతో దూసుకుపోతూ ఇప్పటికి హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె 40 యేళ్లు వచ్చినా కూడా వివాహం చేసుకోలేదు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో త్రిష అందానికి చాలామంది మంత్రముగ్ధులు అవుతున్నారు. సాధారణంగా 30 ఏళ్లు దాటడంతోనే ముడతలు పడిపోయి ఫేస్ మొత్తం అందవిహీనంగా అయిపోతుంది. అలాంటిది 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా అందంగా కనిపించడానికి ప్రధాన కారణం ఆమె మెడికల్ ఇంజక్షన్స్ వేయించుకుంటోందట.

అవకాశాల కోసం తన అందాన్ని అలాగే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇలా ఇంజక్షన్లు తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే 40 లో కూడా త్రిష ఇలా అందంగా ఉండడం చూసి నిజంగానే త్రిష ఇంజక్షన్స్ వేయించుకుంటుందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version