నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Two heroines in Nagarjuna's new film
Two heroines in Nagarjuna’s new film

కాగా, మొన్న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ‘నా సామిరంగ’ అనే కొత్త సినిమా ప్రకటించారు. ‘నా సామిరంగ’ అనే టైటిల్​ను ఖరారు చేస్తూ.. మూవీ ఫస్ట్ లుక్​ టైటిల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం పవర్​ఫుల్​గా ఉంది. నాగార్జున స్టైల్​గా బీడీ కాల్చుకోవడం, లుంగీ మాస్​ లుక్​ అదిరింది. ‘జాతర జాతర’ అంటూ వచ్చే బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ‘ఈ సారి పండక్కి నా సామిరంగ.. కింగ్ మాస్ జాతర మొదలు..’ అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీగా దిగబోతున్నట్లు తెలిపారు.