నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్, అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.
ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటే ఇక వచ్చే ఎపిసోడ్స్ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపి చంద్ ఎపిసోడ్స్ సూపర్ గా ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ రెండు ఎపిసోడ్స్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.ఇక పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రెడీగా ఉంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చెస్తే రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్లో హల్చల్ చేసింది. ఈ షోలో తనదైన స్టైల్ లో రాజకీయంగా సినిమా పరంగా ప్రశ్నలు అడగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హై రెస్పాన్స్ వల్ల పవన్ కల్యాణ్ కి సంబంధించిన ఈ ఇంటర్వ్యూను రెండు ఎపిసోడ్లుగా గా మార్చారు. మొదటి ఎపిసోడ్ ఈ రోజు ( ఫిబ్రవరి 3వ) తేదీన ప్రసారం చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం తెలుగు సినిమా రిలీజ్ లెవెల్లో హంగామా చేస్తున్నారు . ఇప్పటికే ప్రసాద్ ల్యాబ్ లో స్క్రీనింగ్ వేశారు. ఇక విజయవాడ లో పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు. ఇక ఎపిసోడ్ కోసం బాలయ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి వెయిటింగ్ చేసే నిమిషాలే గంటలుగా మారుతున్నాయి.