ప్రత్యూష ఆత్మహత్య పై ఉపాసన ఎమోషనల్ ట్వీట్

-

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోని ప్రముఖ హీరోయిన్లందరికీ ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించారు. రానా లాంటి చాలా మంది హీరోలకు కూడా ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో.. ప్రత్యూష హఠాన్మరణం పై పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యూష మరణం తో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు రామ్ చరణ్ సతీమణి ఉపాసన పేర్కొంది.

ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ ట్వీట్ చేసింది. “ప్రత్యూష నా డియరెస్ట్ ఫ్రెండ్.. చాలా త్వరగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రతి విషయంలోనూ ఆమె ఉన్నతంగా ఆలోచించేది. కెరీర్ పరంగా కుటుంబం, సన్నిహితుల పరంగానూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెషన్కు గురి కావడం బాధ కలిగిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.” అని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించింది ఉపాసన.

Read more RELATED
Recommended to you

Exit mobile version