Upendra UI Movie Review: ఉపేంద్ర “యూఐ” ఒరిజినల్ రివ్యూ

-

Upendra UI Movie Review: దర్శకుడిగా కొత్త కొత్త సినిమాలను అందించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దాదాపు 10 ఏళ్ల తర్వాత నటించి, దర్శకత్వం వహించిన సినిమా “యూఐ”. గతంలో ఉపేంద్ర నటించి, స్వీయ దర్శకత్వం వహించిన రా, ఎ, రక్త కన్నీరు, ఉపేంద్ర వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. పాన్ ఇండియా సినిమాలు అంటూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కానీ.. 90వ దశకంలోనే ఆ ట్రెండ్ ని రుచి చూపించాడు ఉపేంద్ర. ఇప్పుడు చాలాకాలం తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకొని మరోసారి ఈ “యుఐ” అనే మూవీ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో రేష్మ నాణయ్యా, రవిశంకర్, మురళి శర్మ, సాధు కోకిల తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్, మనోహరణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో తెరకెక్కించారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియా ముందుకు వచ్చి ఇస్తున్న ఇంటర్వ్యూలు అందరి దృష్టిని ఆకర్షించాయి. దానికి తోడు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 20న థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులను ఏ మేరా ఆకట్టుకుంది..? అనే విషయాలను ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.

కథ:

ఈ చిత్రం “పగలు, రాత్రి” సత్య వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో సాగుతుంది. ఈ సినిమాలో హీరో పేరు సత్య. సినిమా ఓపెనింగ్ లోనే తెలివైన వాళ్ళు థియేటర్ నుంచి వెళ్లిపోవాలి, మీరు ఫూల్స్ అయితే మొత్తం సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డు వేసి మొదలు పెడతాడు సత్య (ఉపేంద్ర). అతను ఓ మూవీ డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగా సత్య అంతర్గత సంఘర్షణతో బాధపడుతూ ఉంటాడు. దీంతో ఓ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. సత్య దర్శకత్వం వహించిన “యూఐ” సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది. సత్యయుగం నాటి ధర్మాన్ని తిరిగి తీసుకురావాలన్నది సత్య కోరిక. కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరించేవాడు కల్కి(ఉపేంద్ర).

ఇక సత్య తీసిన సినిమా చూసి కొంతమంది జనాలు రియాలిటీ లోకి వచ్చి స్వార్థాన్ని విడిచి తమకు ఫోకస్ దొరికిందని చెబుతూ బయటికి వెళ్లిపోతూ ఉండడం చూపిస్తారు. అయితే సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ని పోలిన క్యారెక్టర్ చేసిన మురళీ శర్మ ఈ సినిమా రివ్యూ చేయడానికి సినిమా చూస్తాడు. కానీ అతనికి ఈ సినిమా అర్థం కాదు. ఓ సీనియర్ రివ్యూ రైటర్ నాలుగు సార్లు సినిమా చూసినా అతనికి ఈ మూవీ అర్థం కాక రివ్యూ రాయలేకపోతాడు. దీంతో సత్యని వెతుక్కుంటూ వెళితే అతను రాసి పడేసిన ఓ స్క్రిప్ట్ దొరుకుతుంది. ఆ స్క్రిప్ట్ ని మనకు సినిమాగా చూపించారు. ఈ సినిమాలో తన తల్లి భూమాతను రియల్ ఎస్టేట్, మైనింగ్, మెడికల్ మాఫియాలు అత్యాచారం చేశాయి అంటూ కధని మొదలుపెడతాడు.

ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరుగుతుంది. ఆ యువతికి సంతానం లేని వీరస్వామి ( అచ్యుత కుమార్ ) దంపతులు ఆశ్రయం కల్పిస్తారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ యువతికి పురిటి నొప్పులు మొదలవుతాయి. అయితే ఈ వీరాస్వామికి జోష్యం చెప్పడంలో అనుభవం ఉంటుంది. ఈమెకి కల్కి భగవానుడు జన్మించనున్నాడని అతడు భావిస్తాడు. కానీ అతను అనుకున్న ముహూర్తానికి ఐదు నిమిషాల ముందే ఓ మగ శిశువు జన్మిస్తాడు. దీంతో అతడు గొప్ప సత్యవంతుడు అవుతాడని ఊహించిన వీరాస్వామి అతనికి సత్య అని పేరు పెడతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీరాస్వామి దంపతులకు తెలియకుండా ఆ వెంటనే ఆ తల్లి మరో శిశువును కూడా కంటుంది.

కానీ ఆ శిశువును ఎవరో దంపతులు అపహరిస్తారు. ఇక వీరు పెరిగి పెద్దయిన తర్వాత అపహరించబడిన శిశువు పెరిగి పెద్దై తనకి తానుగా కల్కి భగవానుడిగా ప్రకటించుకుంటాడు. ఓవైపు సత్యాగా, మరోవైపు కల్కిగా ద్విపాత్రాభినయం చేస్తూ ఉపేంద్ర కనిపిస్తాడు. తన తల్లికి అన్యాయం చేసిన వారిని, ఆ సందర్భంలో చూస్తూ ఉండిపోయిన ఈ సమాజంపై అతను కోపంగా ఉంటాడు. ఈ సమాజంపై పగ పెంచుకుంటాడు. ఇక తన అన్న సత్య ఈ సమాజానికి మంచి చేస్తుండడం చూసి రగిలిపోతాడు. తన అన్నను తీసుకువచ్చి తన సొంత కారాగారంలో బంధిస్తాడు. ఈ సమాజాన్ని తన చేతుల్లోకి తీసుకుందామని కల్కి ప్రయత్నిస్తాడు. ఇక సత్యా తప్పించుకుని బయటకు వచ్చాడా..? అసలు బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు..? ఉపేంద్ర తీసిన సినిమా ఏంటి..? చివరికి మురళీ శర్మ తేల్చిందేంటి..? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే బిగ్ స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చింది ఉపేంద్రనే. సినిమా స్టార్టింగ్ లోనే విచిత్రమైన టైటిల్ కార్డ్స్ పడడంతో ఈ మూవీపై ఆడియన్స్ కి ఆసక్తి పెరుగుతుంది. ఎక్కువగా సోషల్ మీడియా లోనే సమయం గడిపే ఇప్పటి జనరేషన్ కి నేటి సమాజంలో జరిగే సంఘటనలు, ప్రాథమిక హక్కులు, రాజకీయ నాయకులను, జనాల్ని, దేశ, అంతర్జాతీయ సమస్యలను ట్రోల్ చేసేసాడు. దేన్నీ వదలకుండా అన్నింటికీ కౌంటర్లు వేశాడు. ప్రస్తుతం సమాజంలో జరిగే రియాలిటీని ఈ చిత్రంలో చూపించాడు. ఒక్క ఉపేంద్రను తట్టుకోవడమే కష్టం అనుకుంటే.. ఈ సినిమాలో ఇద్దరూ ఉపేంద్రలు తెరపైకి వస్తారు. వీరిద్దరిలో ఎవరు విలన్, ఎవరు హీరో అనేది అర్థం కాదు. ఇక కథ, కథనం, పాత్రలను డిజైన్ చేసిన తీరు ఉపేంద్ర సినిమాలు ఐడియా ఉన్నవారికి కనెక్ట్ అవుతాయి.

కానీ కామన్ ఆడియన్స్ కి, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వారికి ఈ మూవీ కనెక్ట్ కాకపోవచ్చు. ముఖ్యంగా జాతీ, మతం లాంటి విషయాలను ఎత్తి చూపిస్తూనే 2040లో కూడా అలాంటి వాటికోసం కొట్టుకు చస్తున్నారు అన్నట్లుగా ఈ సినిమాలో చూపించడం రియాలిటీ కి దగ్గరలోనే ఉంది. ఇక సత్యా పాత్రలో నటించిన ఉపేంద్ర తన గెటప్స్, డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఈ సినిమాతో వింటేజ్ ఉపేంద్ర ని చూడవచ్చు. యుఐ లో బేసిక్ ఫిలాసఫీ బాగున్నప్పటికీ కథలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక ఈ చిత్రంలో డార్క్ కామెడీ ఉంది. కానీ అది అందరికీ కనెక్ట్ కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్ ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.

ఏ సినిమాలోనైనా హీరో ఇంట్రడక్షన్ అనగానే అతడు విలన్స్ ని చితక్కొట్టడం చూస్తుంటాం. కానీ ఈ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ లో విలన్లు ఇతడిని రక్తం వచ్చేలా కొడతారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర అవసరమే. కానీ కేవలం సాంగ్స్ కోసమే తీసుకున్నట్లు అనిపించింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చారు. సినిమాలోని డైలాగ్ లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా చూస్తే రాజకీయ నాయకులు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో తెలుస్తుంది. ఎప్పుడూ రొటీన్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా అనిపించి నచ్చుతుంది. కానీ ఫైట్స్, లవ్, ఎమోషన్ సీన్స్ కావాలనుకునే వారు ఈ సినిమాని ఎంజాయ్ చేయలేరు.

మైనస్ పాయింట్స్:
గ్రాఫిక్స్
సాగదీత సన్నివేశాలు

ప్లస్ పాయింట్స్ :
ఉపేంద్ర యాక్టింగ్
డైలాగ్స్
స్క్రీన్ ప్లే, కథనం

రేటింగ్: 5/ 3.2

చివరగా ఈ “యూఐ” సినిమా ఉపేంద్ర ఫ్యాన్స్ కి మాత్రమే

Read more RELATED
Recommended to you

Exit mobile version