ఐటీ ఉద్యోగులకు గంజాయి అందిస్తున్న ఐక్యా డ్రైవర్లు..!

-

ఐక్యా అంటే పర్నిచర్‌ అమ్మకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌. హైరదాబాద్‌ ఐక్యా కంపెనీలో కొనుగోలు చేసిన పర్నిచర్‌ ఐటమ్‌ను వ్యాన్లలో సరపరా చేసి వస్తు తిరుగు ప్రయాణంలో గచ్చిబౌళి ప్రాంతంలో పనిచేసే ఐటీ ఉద్యోగులతో ఉన్న సత్‌ సంబంధలు పెట్టుకొని వారికి గంజాయి సరపరా చేస్తు అద`నపు ఆదాయం సంపాందిం చడానికి ప్రయత్నాలు చేస్తూ ఎక్సైజ్‌ ఎస్జిఎఫ్ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. టెలికాం నగర్‌ గచ్చిబౌళి ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ పార్కు ప్రాంతంలో హెచ్డిఎఫ్ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హెచ్ డి ఎఫ్ సీఐ నాగరాజు సిబ్బంది కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఐక్యా సరుకులు రవాణ చేసే వ్యాన్‌లో తనిఖీలు నిర్వహించగా 1.12 కేజీల గంజాయి పట్టుబ డిరది.

ఐక్యా వాహనాల డ్రైవర్లు గచ్చిబౌళి ప్రాంతంలోని ఉన్న వ్యక్తులకు గంజాయి తీసుక వచ్చి ఇస్తు ఉంటారు. గంజాయి అక్రమ రవాణదారులు పర్నిచర్‌ రవాణ చేసే వ్యాన్‌ డ్రైవర్లను వినియోగించుకున్నారు. గంజాయిని తీసుకవచ్చిన చితారి మహేష్‌, డి. సిద్దు లను అరెస్టు చేశారు. వీరిద్దరూ నాగర్‌ కర్నూల్‌ ప్రాంతం. ఈ గంజాయిని పట్టుకున్న వారిలో ఎస్సై జ్యోతి, హెడ్‌కానిస్టేబుల్‌ అలీమ్‌, కానిస్టేబుళ్లు లేఖ సింగ్‌, కార్తిక్‌, రాంచందర్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న ఎస్ టి ఎఫ్ టీమ్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విబికమలాసన్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, డీఎస్పీ తిరుపతి యాదవ్‌ అభినందించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version