వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ ఊహించినట్లుగానే జరిగింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో చాలా ఘనంగా జరిగింది. అయితే మీడియాకు గాని, టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని ఆహ్వానం అందించలేదు మెగా కుటుంబం.

కేవలం మెగా కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. సింపుల్గా చెప్పాలంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ చాలా రహస్యంగా నిర్వహించినట్లు చెప్పుకోవచ్చు. అయితే ఎంగేజ్మెంట్ పై స్వయంగా హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. నా ప్రేమను దక్కించుకున్నాను అంటూ లవ్ సింబల్ తో ఎంగేజ్మెంట్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశాడు వరుణ్ తేజ్. వీరిద్దరూ ఇరు కుటుంబాల పెద్దల మధ్య రింగ్స్ మార్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version