వరుణ్ తేజ్ ‘మట్కా’ టీజర్ రిలీజ్

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ గురించి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ చెప్పినట్టుగానే తాజాగా టీజర్ ని లాంచ్ చేశారు. విజయవాడలోని యువరాజ్ సెంటర్ లో ఉన్న జీ3 థియేటర్ లో మట్కా మూవీ టీజర్ లాంచ్ చేశారు.

ఈ మూవీలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. 1958 నుంచి 1982 వరకు సాగే పీరియాడిక్ కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. నవంబర్ 14న మట్కా మూవీ విడుదల కానుంది. విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకు రావాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు ప్రమోషన్లు ఇప్పటికే షురు అయ్యాయి. మంచి హైప్ క్రియేట్ అవుతోంది. మట్కా మూవీ హిట్ కావడం పక్కా అని టీజర్ చూస్తే.. స్పష్టంగా అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version