గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల ఇండ్లను, కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ కూల్చివేతలపై కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొందరు బాధితులు కోర్టులను ఆశ్రయిస్తుండగా.. న్యాయస్థానాలు సైతం చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు హై పవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది.
తాజాగా హైడ్రా చేపట్టబోయే అన్ని కూల్చివేతలు, కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. దానిపై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు. దీంతో హైడ్రాకి చట్టబద్దత లభించినట్టు అయింది. ఆ హైడ్రా చట్టబద్దతకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపారు. హైడ్రా చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్డీనెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది.