అల్లు అర్జున్ జాతకం పై అలాంటి కామెంట్స్ చేసిన వేణుస్వామి..!

-

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎక్కువగా యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోని సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయిన ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లకు వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ల జాతకంలో దోషాలు ఉన్నవారి చేత యాగాలు చేయించి వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు కూడా వేణు స్వామి చేత పూజ చేయించుకున్నారు. ఇక డింపుల్ హయతి కూడా పూజ చేయించిన విషయం తెలిసిందే.

ఒక ఏడాది క్రితం అల్లు అర్జున్ జాతకం చెప్పిన ఆయన నిన్నటికి నిన్న అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో ఏడాది క్రితం తాను చెప్పిన జాతకం నిజమని మరొకసారి వీడియోని వైరల్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.. ఇవన్నీ జాతకం గురించి వేణు స్వామి ఏమన్నారు అంటే.. అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదుగుతాడు. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటాడు. కళ్ళు మూసుకుంటే రూ.300 కోట్లు ఆయన సినిమాకు వచ్చేస్తాయి. బన్నీ సినిమాల వల్ల నిర్మాతలకు ఎటువంటి టెన్షన్ ఉండదు.. అల్లు అర్జున్ కి రిస్క్ లేదు.

పదేళ్లు తిరుగు ఉండదు.. ఆయన ఈ పదేళ్లు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. ఆయన ఏ సినిమా తీసినా కూడా మినిమం రూ .200 కోట్లు రావడం గ్యారెంటీ.. ఇక నిర్మాతలు కూడా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోవచ్చు అంటూ వేణు స్వామి కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో వేణు స్వామి చెప్పిన మాటలు నిజమేనని అందరూ నమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version