కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వీ6 ఛానల్ ఓనర్ గడ్డం వివేక్!!

-

తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీకి ఊహించని షాక్ తగలనుంది. బిజెపి సీనియర్ నేత, వి6 అధినేత వివేక్ వెంకటస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే బిజెపి పార్టీకి రాజీనామా చేసి… కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు వివేక్ వెంకటస్వామి.

ఈనెల 30వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు వివేక్ వెంకటస్వామి సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా బిజెపి పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని… వివేక్ వెంకటస్వామి అసంతృప్తితో ఉన్నారట. అలాగే అసెంబ్లీ ఎన్నికలు తరముకొస్తున్న వేళ… బిజెపి పార్టీ… సీఎం కేసీఆర్ కు బీ టీమ్ గా మారిపోయిందనే సంకేతాలు రావడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారట వివేక్ వెంకటస్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version