TV9: మీడియాకు మంచు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ తరుణంలోనే…మంచు మోహన్ బాబు క్షమాపణలు చెప్పినట్లు లేఖ వైరల్‌గా మారింది. ముఖ్యంగా టీవీ9 ఛానెల్ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు. తన వల్లే.. మీ రిపోర్టర్ కు గాయాలు అయ్యాయి.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు.
కావాలనే నేను చేయలేదు… తన పరువు పోయేలా కొంత మంది వ్యవహరించారు.. ఆ కోపంలో ఇలా జరిగింది. 48 గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నాను…ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నా… అంటూ లేఖ విడుదల చేశారు మోహన్ బాబు. మీడియా సభ్యులందరికీ క్షమాపణలు అంటూ పేర్కొన్నారు మోహన్ బాబు.
కాగా… నువ్వు ఎవడు ?…ముసలోడివి… అంటూ మంచు మనోజ్ రచ్చ చేసిన వీడియో వైరల్ గా మారింది. జల్ పల్లిలో మోహన్ బాబు దగ్గరకు వెళ్లిన మంచు మనోజ్…అక్కడ నానా రచ్చ చేశాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.