హైదరాబాద్‌ లో దారుణం..భార్య, కుమారున్ని చంపి..ఆత్మహత్య చేసుకున్న సిరాజ్‌ !

-

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. భార్య, కుమారున్ని చంపి..ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని, తొప్ ఖానాలో దారుణం జరిగింది. భార్య, కుమారుణ్ని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు సిరాజ్. తల్లి తమ్ముణ్ణి చంపుతున్న తండ్రిని చూసి కేకలు పెట్టి పారిపోయాడు సిరాజ్ పెద్ద కొడుకు. ఇక ఆ అరుపులతో అలర్ట్ అయిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న బేగంబజార్ పోలీసులు,క్లూస్ టీం.. కేసు నమోదు చేసుకున్నారు. భార్య హేలియ గొంతు కోసిన అనంతరం ఖుమారుడు హైజాన్ గొంతు నులిమి చంపాడు మహమ్మద్ సిరాజ్. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉత్తర ప్రదేశ్ నుంచి బ్రతుకు దేరువు కోసం హైదరాబాద్ వచ్చింది మృతుని కుటుంబం. బేగంబజార్ లోని స్థానిక బ్యాంగిల్ స్టోర్ లో పనిచేస్తున్నాడు సిరాజ్జ తాను పనిచేస్తున్న సమీపంలోని భవనంలో రెండు రోజులు క్రితం ఇల్లు కిరాయికి తీసుకున్న సిరాజ్.. దారుణానికి పాల్పడ్డాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version