తమన్నాతో ప్రేమపై విజయ్‌ హాట్‌ కామెంట్స్‌

-

 

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మిల్క్ బ్యూటీ తమన్నా .. తెలుగుతోపాటు తమిళ , హిందీ భాషల్లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తమన్నా, నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే వీరిద్దరూ నిజంగా రిలేషన్ లో లేరని ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రచారం కోసం అలా చెప్పారని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ తాజాగా విజయవర్మ… తమన్నాతో తన రిలేషన్ గురించి స్పందించారు. ఆమెతో పీకల్లోకి ప్రేమలో ఉన్నట్లు చెప్పారు.

“మేమిద్దరం డేటింగ్ లో ఉన్నామని ఇప్పుడు నాకు బాగా అర్థం అవుతుంది. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె రాకతో నా జీవితంలో విలన్ దశ ముగిసిపోయి రొమాంటిక్ దశ మొదలైంది” అని చెప్పారు. తమన్నా – విజయ్ వర్మ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’. ఈ సిరీస్ షూట్ లోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇష్టఇష్టాలు కలవడంతో ప్రేమలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version