వాలంటీర్లు.. పర్మినెంట్ ఉద్యోగులు కారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని…మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఫైర్ అయ్యారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని.. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి ఉందన్నారు.
పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తోన్న పరిస్థితి ఉందని విమర్శలు చేశారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా..? యువతకు ఉపాధి అన్నారు.. కానీ అలా జరగడం లేదని ఆగ్రహించారు. వలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగులు కారు.. వారిని కలుపుకుని ఉపాధి కల్పించామనే లెక్కలు వేసి చెబుతున్నారు….పెట్టుబడులు రావడం లేదు.. వచ్చిన పరిశ్రమలు ఉండడం లేదన్నారు. లూలూ, జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని.. ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోందని ఆరోపించారు.