హిట్ కోసం ఐదేళ్లు ఎదురుచూశా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు

-

టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం హిట్‌ అనే టాక్ వినిపిస్తోంది. చాలా రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు.. శాకుంతలం ఇచ్చిన షాక్ నుంచి కోలుకునేందుకు వేచిచూస్తున్న సమంతకు ఈ సినిమా రిజల్ట్ కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా పాజిటివ్ టాక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమా రిజల్ట్‌పై.. సినిమా చూసిన ప్రేక్షకుల రియాక్షన్‌పై స్పందించాడు. ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశాడు. ”మీరందరూ నాతో పాటు 5 సంవత్సరాలుగా హిట్టు కోసం వెయిట్ చేశారు. నా పని నేను చేస్తానని ఓపికగా ఎదురు చూస్తున్నాను. మొత్తానికి ఈ రోజు హిట్టు కొట్టేశాం.. వందల కొద్ది ఫోన్లు, మెసెజ్‌ల‌తో నిద్రలేచా.. ఈ క్షణంలో నేను కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేను. నేను మీ అందరి పట్ల ప్రేమతో ఉన్నాను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఖుషికి వెళ్లి ఆనందించండి. ప్రేమతో మీ విజయ్ దేవరకొండ” అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version