Family Star : హీరోయిన్ తో ఫ్యామిలీ స్టార్ దీపావళి

-

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో ఎన్ని సినిమా అవకాశాలు తెచ్చి పెట్టిందో మనము చూశాము. ఇక  హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి స్టార్ VD13గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.

Vijay Deverakonda and Mrunal Thakur shine in festive fervour in Family Star’s Diwali special poster

మేకర్స్ ఇటీవలె ఫ్యామిలీ స్టార్ టైటిల్ లుక్ ను షేర్ చేస్తూ లాంచ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ లో బాలీవుడ్ భామ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ…. కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్ చిచ్చుబుడ్డి వెలిగిస్తున్న లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version