బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి భోలే షావలి ఔట్‌

-

తెలుగు రియాల్టి షో బిగ్ బాస్ సీజన్ -7 విజయవంతంగా పదో వారం పూర్తి చేసుకుంది. పదో ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకుని హోస్టు నాగార్జున కంటెస్టులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు బిగ్‌బాస్‌ వేదికపైకి వచ్చి సందడి చేశారు. హౌస్‌లో ఉన్న వాళ్లతో మాట్లాడి.. టాప్‌-5లో ఎవరెవరు ఉంటారో.. ఎందుకు ఉంటారో తమ అభిప్రాయాన్ని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ముచ్చట్లతో ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్  చాలా సందడిగా సాగింది.

 

అయితే ఇంత సందడిలో చివరలో కాస్త ఎమోషన్ యాడ్ అయింది. బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి ఈ వారం సంగీత దర్శకుడు భోలే షావలి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో భోలే షావలి, గౌతమ్‌ కృష్ణ, శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, రతికలు ఉండగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన భోలే షావలి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. ఈ సందర్భంగా వేదికపై పాట పాడి, బిగ్‌బాస్‌ గేమ్‌ను భోలే షావలి షో నుంచి వెళ్లిపోయాడు. ఇటీవలే వైల్ కార్డ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే..  మొదటి వీక్ లో అంతగా అలరించకపోయినా.. తర్వాత తన కామెడీ, పాటలతో హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులను అలరించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version