#SSMB29 నుంచి లేటెస్ట్ అప్డేట్ బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్.. ఫ్యాన్స్ కి పూనకాలే.!

-

#SSMB 29… ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే సెట్ పైకి వెళ్లనుంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇకపోతే తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సరికొత్త అప్డేట్ ను వదలడం జరిగింది.

అసలు విషయానికి వస్తే.. రాజమౌళితో సినిమా అంటే మినిమం రెండు సంవత్సరాలు సమయం పడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇలా టైం తీసుకుని వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఇప్పుడు రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తుండగా.. స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ అప్పుడప్పుడు మహేష్ బాబు – రాజమౌళి సినిమా గురించి కూడా చెబుతూ ఉంటారు.

ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. దీన్ని సినిమాగా కాకుండా ఫ్రాంచైజీగా తీస్తామని అన్నారు. అంటే ఈ ప్రాజెక్టుకు సీక్వెల్స్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. లీడ్ రోల్స్ అలానే ఉంటాయని.. కానీ కథ ,నేపథ్యం మారుతుందని తెలిపారు . దీన్ని చూసిన మహేష్ అభిమానులు ఫస్ట్ పార్ట్ కి ఇంకో నాలుగు ఐదు ఏళ్ళు పెట్టొచ్చు. అదే సీక్వెల్స్ అంటే ఈజీగా ఇంకో 20 ఏళ్లు అయిపోతుంది అంటూ నవ్వుతూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికైతే మహేష్ బాబుతో మరో అదిరిపోయే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version