వైరల్: ‘వకీల్ సాబ్’ ఫోటోలు లీక్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వకుండా నిర్మాతలు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ సినిమాకు సంబంధించి ఫోటోలు షూటింగ్ మొదలైనప్పటి నుంచి లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రముఖ హిందీ చిత్రం పింక్ రీమేక్ గా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

pawan kalyan

సినిమా షూటింగ్ పూర్తయినా లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా వకీల్ సాబ్ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్లైమాక్స్ ఫైట్స్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నటుడు దేవ్ గిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. క్లైమాక్స్ ఫైట్ కు సంబంధించిన ఫోటోలతో పాటు దేవ్ గిల్.. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

ఈ ఫైటింగ్ స్టిల్స్ చూస్తుంటే సినిమాలో చాలా మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. చుట్టూ వందలమంది జనం.. పెద్ద అల్లర్లు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్, దేవ్ గిల్ మధ్య జరుగుతున్న పోరాటం సినిమా స్థాయిని పంచేలా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసి పవర్ స్టార్ అభిమానుల్లో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ ఏడాది ట్విటర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ సినిమా కూడా నిలిచింది.

pavan

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిందీ మూవీ ‘పింక్’ రీమేక్. ఇందులో నివేదా థామస్, అంజలి, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజకీయాల్లో బిజీ అయినా పవర్ స్టార్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటించబోతున్నారు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version