మీకు దండం పెడతా… నా భర్తను తిట్టకండి : పల్సర్ బండి ఝాన్సీ

-

గాజువాకకు చెందిన లేడీ కండక్టర్‌ ఝాన్సీ ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే.. చాలు.. లేడీ కండక్టర్‌ ఝాన్సీ డాన్స్‌ కనిపిస్తోంది. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో పల్సర్‌ బైక్‌ పాట చేసింది. కేవలం ఒక్క పాటకు డాన్స్‌ చేసి.. ఓవర్‌ నైట్‌ సెలబ్రిటీ అయిపోయింది.

అంతేకాదండోయ్‌.. ఇంటర్నెట్‌ లో ఆర్టీసీ ఝాన్సీ గా గుర్తింపు సంపాదించికుంది. ఝాన్సీ ప్రస్తుతం గాజువాక బస్‌ డిపోలో కండక్టర్‌ గా పనిచేస్తూ.. డాన్స్‌ ఫర్ఫామెన్స్‌ లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే… ఆమె వ్యక్తిగత జీవితం గురించి, డ్యాన్స్ కోసం ఆమె కష్టాలను తెలుసుకొని ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే కొందరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో ఝాన్సీ మాట్లాడుతూ, “నన్ను కండక్టర్ గా కాదు, ఒక డాన్సర్ గా గుర్తించి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఆహ్వానించారు. అక్కడ నేను చేసిన పర్ఫామెన్స్ కి ఎంతో గొప్ప పేరు వచ్చింది. అయితే వీడియోస్ కింద కొందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. నన్ను సపోర్ట్ చేసిన నా భర్తను కూడా తిడుతున్నారు. దయచేసి అలా చేయకండి” అంటూ ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version