“మాకెందుకయ్యా ఇది” కేంద్రాన్ని నిలదీస్తోన్న విశాక వాసులు ?

-

సరిగ్గా 2019 ఎన్నికల ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కి సౌత్ కోస్ట్ పేరుతో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది.  ఆ సందర్భంలో రైల్వే బోర్డు లో చర్చించి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి నాలుగైదు నెలల్లో పనులన్నింటినీ ముగించుకొని జోన్ ఉనికిలోకి తెస్తామని చెప్పటం జరిగింది. అయితే ప్రకటించిన సంవత్సరం కావస్తున్నా గాని రైల్వే జోన్ కి సంబంధించి ఒక ప్రకటన కూడా కేంద్ర వర్గాల నుండి రాలేదు. మరో ముందడుగు పడలేదు.

అంతేకాకుండా ఆ సమయంలో పీయూష్ గోయల్ ప్రకటించిన జోన్‌లో.. వాల్తేరు రైల్వే డివిజన్ లేదు. ఈ డివిజన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటూ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌లోని భాగాలను కవర్ చేస్తుంది. దీన్ని కూడా… సౌత్ కోస్ట్ జోన్‌లో ఉంచాలనే డిమాండ్లు వచ్చాయి. అవి రాజకీయ డిమాండ్లుగానే ఉండిపోయాయి. అసలు జోన్‌కే ఇప్పుడు ఎసరు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.

 

అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ ఏ విషయంలో కూడా కేంద్రం ఎన్నడూ స్పందించిన దాఖలాలు లేవు. ఇటువంటి తరుణంలో తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో కూడా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కొన్ని మౌలిక సదుపాయాల అవసరత తీర్చడానికి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు అని అందరూ భావించిన…కేంద్రం మొండిచేయి చూపించడంతో…విశాఖ వాసులు సౌత్ కోస్ట్ పేరుతో ఏర్పాటైన రైల్వేజోన్ మాకెందుకు ఇది…ప్రకటించారు గాని దానికి ఉనికే లేకుండా పోయింది…అని నిలదీస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version