అల్లూ అరవింద్ కి చెక్ పెట్టిన దిల్ రాజు – రసవత్తరమైన పోటీ !!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు ఉండగానే ఎక్కువగా నిర్మాత దిల్ రాజు మరియు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సంస్థ ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అంటుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఆయువుపట్టు లాంటి నైజాం మార్కెట్ దిల్ రాజు చేతిలో ఉంటుందని అలాగే రెండు స్టేట్ ల పరంగా…ఎక్కువ సినిమా హాలు అల్లు అరవింద్ చేతుల్లో ఉంటాయి అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

ఇటువంటి నేపథ్యంలో తెలుగు సినిమాల వ్యాపార విషయంలో ఇద్దరి మధ్య రసవత్తరమైన పోటీ ఉన్న తరుణంలో తాజాగా అల్లు అరవింద్ కి దిల్ రాజు చెక్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ప్లిక్స్‌, హాట్‌ స్టార్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు అల్లు అరవింద్ ఓటీటీ బిజినెస్ లోకి అడుగుపెట్టడం జరిగింది. ఆహా అంటూ అల్లు అరవింద్‌ ఈ ఓటీటీ కి పేరు పెట్టడం జరిగింది.

 

అంతేకాకుండా చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఆహా  ఓటీటీ లోకి కొద్దిరోజుల వ్యవధిలోనే విడుదల అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలు అన్నీ అల్లు అరవింద్ తీసుకుంటు అద్భుతమైన బిజినెస్ చేస్తున్న తరుణంలో అల్లు అరవింద్ కి పోటీగా ఇటీవల ఇదే వ్యాపార రంగంలోకి దిల్ రాజు కూడా దిగబోతున్నాడు. వీరిద్దరు కలిసి ఉన్నట్లుగానే అనిపించినా కూడా ఇప్పుడు ఓటీటీ వ్యాపారం బాగుంది కనుక దిల్‌ రాజు కూడా ఆ రంగంలో అడుగు పెట్టాలని భావిస్తున్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version