ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. “గెట్ రెడీ ఫర్ వార్” అంటూ ఎన్టీఆర్ యాక్షన్ డైలాగ్ సన్నివేశాలతో కూడిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వార్-2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా…. యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

కాగా, ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. కాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో తన అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు అందరూ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన అభిమానులు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.