వామ్మో.. ప్రముఖ నటుడు జగ్గయ్యలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

-

చిన్న వయసులోనే రామాయణంలో లవుడి పాత్ర పోషించి.. రంగస్థలం నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన జగ్గయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి స్టార్ హీరోల రేంజ్ లో సినిమాలలో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన 1928 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మోరంపూడి అనే గ్రామంలో జన్మించారు. ఉన్నత చదువులు చదివిన తర్వాత విలేకరు గా కొద్దిరోజులు పనిచేసిన ఆయన తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ పత్రికకు ఎడిటర్ గా కూడా పనిచేశారు.

ఆకాశవాణి రేడియోలో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న సమయంలోనే త్రిపురనేని గోపీచంద్ తో పరిచయం ఏర్పడి.. ఆయన తీసిన ప్రియురాలు అనే సినిమా ద్వారా 1952లో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక సినిమా విజయం సాధించడంతో రేడియో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న ఈయన ఆ ఉద్యోగానికి స్వస్తి పలికి.. మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా బి.యన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బంగారు పాప సినిమాలో కూడా నటించిన ఈయన ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో జగ్గయ్య పేరు మారుమ్రోగిపోయింది.

1950 నుంచి 1970 వరకు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన జగ్గయ్య కంచు కంఠంతో స్పష్టమైన ఉచ్ఛారణతో సంభాషణలు పలికే కొంగర జగ్గయ్య గా పేరు తెచ్చుకున్నారు. జగ్గయ్య కంచు కంఠంతో చెప్పిన డైలాగులను చూసి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కళావాచస్పతి అనే బిరుదును కూడా అందించింది. ఇక ఎన్టీఆర్ ,ఏఎన్నార్ లు కూడా తమకు సమకాలీన నటుడుగా చెబుతూ ఉండేవారు. ముఖ్యంగా సెకండ్ హీరోగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావులతో చేసినప్పటికీ కూడా ఆ తర్వాత వారి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి పేరు సంపాదించుకున్నారు. శివాజీ గణేషన్ సినిమాలను తెలుగులో ఎక్కువగా డబ్ చేసేవారు. అయితే ఆ సమయంలో శివాజీ గణేషన్ వాయిస్ కి జగ్గయ్య డబ్బింగ్ చెప్పేవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version