వామ్మో.. ఎన్టీఆర్ ఆస్తి అన్ని కోట్లా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన తర్వాత ఈయనకు విదేశాలలో కూడా ప్రేక్షకులు సైతం అభిమానులుగా మారడం గమనార్హం. అతి చిన్న వయసులోనే బాల రామాయణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈయన ఆ తర్వాత తాతకు తగ్గ మనవడిగా అతి తక్కువ వయసులోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు 29 సినిమాలలో నటించిన ఈయన ఎంత సంపాదించాడు ?ఒక్కో సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటాడు? ఆయన ఆస్తి ఎంత ?అనే ప్రతి విషయం కూడా వైరల్ కావడానికి ఒక కారణం ఉంది.

అదేమిటంటే ఇటీవల తన భార్య లక్ష్మీ ప్రణతి పై ఉన్న ప్రేమను ఎలా చూపించుకోవాలో తెలియక ఏకంగా 6.5 ఎకరాలలో నిర్మించిన ఫామ్ హౌస్ కు బృందావనం అనే పేరును పెట్టి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు ఎన్టీఆర్. ఇక దీంతో ఎన్టీఆర్ ఎంత ఆస్తి కూడబెట్టాడు? అనే విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20వ తేదీన నందమూరి హరికృష్ణ , షాలిని దంపతులకు జన్మించారు. చిన్న వయసు నుండి కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. ఇక ఆ తర్వాత తన తాత ఎన్టీఆర్ డైరెక్షన్లో వచ్చిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనే హిందీ సినిమాలో 1991లో నటించారు ఎన్టీఆర్.

ఇకపోతే ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి చిత్రం నిన్ను చూడాలని .. ఈ సినిమా కోసం ఏకంగా రూ.4 లక్షలు తీసుకున్న ఎన్టీఆర్ ఇంత డబ్బు ఏం చేయాలో తెలియక తన తల్లి చేతికి ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు ఈయన రూ.440 కోట్ల వరకు ఆస్తి కూడబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. అంతేకాదు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా అలాగే పలు వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తున్నందుకు ఈయన భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లో రూ.50 కోట్ల విలువైన ఒక బంగ్లా ఉంది. అంతేకాదు బెంగళూరులో కూడా ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇక రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. మరికొన్ని విలువైన లగ్జరీ కార్లు , సుమారుగా రూ. 12 లక్షలకు పైగా విలువ చేసే రెండు వాచ్ లు కూడా ఆయన దగ్గర ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version