వీ.కే.నరేష్ కొడుకులు ఇప్పుడు ఏమి చేస్తున్నారంటే..?

-

ప్రముఖ నటుడిగా, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వీ.కే. నరేష్ దివంగత నటీమణి..దర్శకురాలు.. నిర్మాత అయిన విజయనిర్మల మొదటి భర్త సంతానమే నరేష్. తల్లి ఇన్ఫ్లుయెన్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ కామెడీ హీరోగా స్థిరపడిపోయారు. ప్రస్తుతం అవకాశాలు హీరోగా రాకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. సినిమాలపరంగా పోలిస్తే వ్యక్తిగత విషయాలలో ఈమధ్య భారీగా వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. ఈ క్రమంలోనే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ఇప్పుడు పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. వారి ముగ్గురిని వదిలేసిన వారి ముగ్గురుకి కలిగిన సంతానం గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్న నరేష్ కు ఒక కొడుకు జన్మించాడు. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ. ఇతడు హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ పెళ్లి ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు సుప్రియను వివాహం చేసుకోగా వీరికి కూడా ఒక కొడుకు జన్మించారు. ప్రస్తుతం అతడు కూడా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం.

ఇక మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకోగా వీరి బంధానికి గుర్తుగా కూడా ఒక అబ్బాయి జన్మించాడు. అయితే ఆ అబ్బాయి ఇంకా చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ముగ్గురు భార్యలు, ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ వారందరినీ కాదని ఇప్పుడు మళ్లీ నరేష్ నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇది వారి వ్యక్తిగత విషయం కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఏమైనా ఇలా వ్యక్తిగతంగా కూడా నరేష్ బాగా వార్తల్లో నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version