పవన్ కళ్యాణ్ కి అటు వ్యక్తిగతంగా, ఇటు సినిమాల విషయంలో అత్యంత సన్నిహితుడు, మిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో వచ్చిన పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ తప్ప మరెవరితోనూ అంత క్లోజ్ రిలేషన్ లేదని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల మద్య స్నేహం చాలా ఏళ్లుగా కొనసాగుతుంది. రాజకీయాల్లోకి వెళ్లినా… పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ విడిపోలేదు. కాబట్టే త్రివిక్రమ్ చెప్పాడని పింక్ రీమేక్ విషయం అలోచించి.. ఆ సినిమాకి ఓకే చెప్పాడు.
అయితే త్రివిక్రమ్ చెప్పడం తోనే పవన్ పింక్ రీమేక్ ఒప్పుకున్నాడని పవన్ ఫ్యాన్స్ రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తుంటే మంచి కమర్షియల్ అండ్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్ చేయమని చెప్పాల్సింది పోయి పింక్ సినిమా రీ మేక్ లో నటించమని ఎలా సలహా ఇచ్చారు అంటు త్రివిక్రమ్ ని బాగానే ఏసుకున్నారు. ఇప్పటికే రెండు భాషల్లో చూసేసిన సినిమాని చేయమని పవన్ కళ్యాణ్ కి చచ్చు సలహా ఇచ్చారని త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ అంతగా మాట్లాడటం లేదని తాజా పరిణామాణాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది.
వేణు శ్రీరామ్, క్రిష్ తర్వాత ఖచ్చితంగా త్రివిక్రమ్ తో పవన్ సినిమా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారంటే అందరూ ముందు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందనే అనుకున్నారు. అజ్ఞాతవాసి కూడా డిజాస్టర్ అయింది కాబట్టి ఈ సారి బ్లాక్ బస్టర్ ఇస్తారు పవన్ కళ్యాణ్ కి అంటూ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద పై ఫోకస్ పెట్టలేదని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ అల వైకుంఠపురములో హిట్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కమిటయ్యాడు. ఆ తర్వాత రాం చరణ్ లేదా మహేష్ బాబుతో సినిమా చేస్తాడని సమాచారం. అంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబోలో అసలు సినిమా గురించి చర్చలే జరగలేదని అర్థమవుతుంది. మరి ఈ ఇద్దరి మద్య అసలు ఏం జరుగుతుంది… వీరి కాంబినేషన్ లో సినిమా ఉందా లేదా అన్నది ఎవరో ఒకరు చెప్పాలి.