ఒకరేమో సూపర్ స్టార్ అయితే.. మరొకరేమో యూనివర్సల్ స్టార్.. ఒకరేమో నవరసాలను పండించగల సమర్ధుడు అయితే.. మరొకరు స్టైల్ లో అదరగొట్టగలరు.. డైలాగులు దంచగలరు. ఇద్దరిది చెరోదారి.. కాని ఇద్దరి క్రేజ్ మాత్రం ఒక్కటే. ఒకరెక్కువ ఒకరు తక్కువ అని తీసేయలేం. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే.. ఒకరు సూపర్ స్టార్ రజినికాంత్ కాగా.. మరొకరు విశ్వనటుడు కమల్ హాసన్.
తెలుగులో మన సీనియర్ హీరోలతో పాటుగా సమానమైన క్రేజ్ ఉన్న స్టార్స్ ఈమధ్య ఎందుకో సినిమాల ఫలితాల్లో వెనుకపడుతున్నారు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా వీరి సినిమాల ఫలితాలు అంత సాటిస్ఫైడ్ గా లేవన్నది ట్రేడ్ రిపోర్ట్. మనదగ్గర సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు ఇంకా తమ క్రేజ్ కొనసాగిస్తున్నారు.
కాని కోలీవుడ్ లో పరిస్థితి మారింది. రజిని, కమల్ సినిమాలు కూడా మంచి టాక్ వస్తేనే చూసేస్తున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న ఈ ఇద్దరి స్టార్స్ ఇటీవల సినిమాల ఫలితాలు చూస్తే విషయం ఏంటన్నది మనకే అర్ధమవుతుంది. రజిని సినిమా యావరేజ్ గా ఉన్నా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. కాని కబాలి, కాలా అంత భారీ వసూళ్లను సాధించలేదు.
ఇక కమల్ విషయానికొస్తే.. ఎప్పుడు ప్రయోగాల బాట పట్టే ఈయన విశ్వరూపం-2 ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎంతలా అంటే కమల్ నటన కూడా కొత్తగా అనిపించలేనంతగా ఈ సినిమా ఉంది. ఎలాగు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి సినిమాల మీద అంత ఫోకస్ పెట్టట్లేదని తెలుస్తున్నా సినిమాల క్రేజ్ తోనే వారు పాలిటిక్స్ లోకి వచ్చింది అన్న విషయం మర్చిపోయినట్టు ఉన్నారు. మరి ఇక్కడ ఇమేజ్ డ్యామేజ్ అయితే అన్ పాపులర్ అయ్యే అవకాశం ఉంది.
పరిస్థితి చూస్తుంటే వారి సిని కెరియర్ కు దాదాపు పూర్తయినట్టే అంటున్నారు. కమల్ ఇప్పటికే తాను సినిమాలు తీయనని చెప్పేయగా.. రజిని మాత్రం ఇంకా ఆ ఎనౌన్స్ మెంట్ చేయలేదు. మరి ఈ లెక్కలను వారు ఎలా సెట్ చేసుకుంటారో కాని కమల్, రంజిని పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ టైంలో సినిమాల ఫలితాలు నిరాశపరచడం ఆ హీరోల ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ అయ్యేలా చేస్తున్నాయి.