ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. బాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అక్కడ రూ.100 కోట్ల మార్కు క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు తెలుగు సినిమా బాలీవుడ్ లో అంత గ్రాస్ వసూలు చేయడం అరుదైన విషయమని చెప్పవచ్చు. దీంతో బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ పొందాడు అల్లు అర్జున్. ఇకపోతే పుష్పా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వీరు ఇప్పుడు పుష్ప 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ఏమిటంటే.. పుష్ప సినిమాని ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట సుకుమార్ ఈ సినిమా కథను మహేష్ బాబు కోసం సిద్ధం చేశారట. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు సినిమా కథ వినిపించాడట. కానీ మహేష్ బాబు ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే అల్లు అర్జున్ కి చెప్పడం ఆయన వెంటనే ఓకే చేయడం జరిగిపోయాయని సమాచారం. ఇప్పటికే సుకుమార్ మహేష్ బాబుతో 1నేనొక్కడినే సినిమా చేశారు. ఆ సినిమా కథను మహేష్ కి చెబితే అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చెప్పి మరీ ఒప్పించి తీశాడు. కానీ ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ పొందింది.
మళ్లీ సుకుమార్ తో సినిమా అంటే భయపడిన మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి వెనుకడుగు వేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ అవకాశాన్ని అల్లు అర్జున్ ఉపయోగించుకొని పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మొత్తానికైతే ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టింది.