జగన్ ‘ఒక్కడే’..అందరూ కలిసి రండి..!

-

ఏపీలో ఎలాంటి పరిస్తితినైనా తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ పరమైన లబ్ది పొందడంలో అధికార వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి. అసలు వైసీపీ వ్యూహాలు చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే అని చెప్పవచ్చు. తమకు నెగిటివ్ గా ఉన్న పరిస్తితులని సైతం అనుకూలంగా మార్చుకునే సత్తా వైసీపీకి ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి కాస్త ప్రతికూల పరిస్తితులు ఉన్న మాట వాస్తవమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఆ పరిస్తితులని సైతం తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా వైసీపీ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేనలు పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు-పవన్ కలిశారు..పొత్తు గురించి క్లారిటీ ఇవ్వలేదు గాని..వైసీపీపై కలిసి పోరాటం చేస్తామని చేపారు. ఇప్పుడు బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు పవన్ వచ్చారు. ఇలా పవన్-బాలయ్య కలవడంపై వైసీపీ విమర్శలు చేస్తుంది. బావతో కలిసే తిరిగే పవన్…బామ్మర్దితో కూడా తిరిగితే తప్పేం ఏముందిలే అని ఎద్దేవా చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా జగన్‌ని ఎదురుకునేందుకే ఇలాంటి స్కెచ్ లు వేస్తున్నారని అంటున్నారు.

తాజాగా టీడీపీ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో వైసీపీ టార్గెట్ గా నేతలు విమర్శలు చేశారు. దీంతో అందరూ కలిసిరండి అని, అదేదో ప్రజలకు కూడా తాము అంతా కలిసి ఉన్నామని చెప్పి..రాజకీయం చేయవచ్చు కదా అని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అవుతున్నారు. అంతా కలిసి రండి..జగన్ ఒక్కడే వస్తారని అంటున్నారు.

పేర్ని నాని మాత్రమే కాదు..వైసీపీ నేతలు అంతా ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే జగన్ వన్ మ్యాన్ ఆర్మీ అని, ఆయన్ని చంద్రబాబు ఎదురుకోలేక అందరినీ కలుపుకుని వస్తున్నారని, ఎవరితో వచ్చిన ప్రజలు జగన్ వైపే ఉంటారని అంటున్నారు. అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులు పక్కకు వెళ్ళేలా చేసి..అందరూ కలిసి జగన్‌ని ఒంటరి చేసి ఇబ్బంది పెడుతున్నారని జనంలో సెంటిమెంట్ లేపి..మళ్ళీ వైసీపీకి మద్ధతు పెంచాలని చూస్తున్నారు. మరి వైసీపీ నేతల మాటలు జనం ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version