త్వరలోనే ఆల్లు వారి అహ దినపత్రిక.. సక్సెస్ అయ్యేనా..?

-

ఓటిటీ ప్లాట్ ఫామ్. అహ అతి తక్కువ సమయంలోనే ఎంతటి పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ,తమిళ్లో సూపర్ సక్సెస్ అయ్యింది ఈ ఓటీటి ఛానల్ .దీంతో ఆహా టీమ్ మరొక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆహా దినపత్రిక ను తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రావడం జరిగింది. ఉదయాన్నే ఒక చేతిలో కాఫీ మరొక చేతిలో పేపర్ ఆహా ఆ ఊహ ఎంత బాగుందో కదా అంటూ అల్లు అరవింద్ ఆహా ట్విట్టర్ నుంచి పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

ఆహా దినపత్రిక మీ ముంగిట్లోకి అంటూ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన స్పందించిన నేటిజన్స్ జనసేన పార్టీ కోసమే ఈ డిసిషన్ తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు మరి కొంతమంది అయితే ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్త పత్రికకు సంబంధించి లోగోను కూడా షేర్ చేయడం జరిగింది. ఆహ నుంచి ప్రకటన రావడంతో ఫ్యాన్స్ మాత్రం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ప్రకటన ఫ్రాంక్ అనే విషయం పైన ఆహా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఈ అంశంపై తదుపరి సమాచారం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. వినోద రంగంలో బాగా దూసుకుపోతున్న ఆహా ఓటీటి సంస్థ మరి దినపత్రిక విషయంలో ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.. ఇది నిజంగా ప్రాంతాలు లేదా వాస్తవం అనే విషయం కూడా తెలియాల్సి ఉన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version