బాలయ్య వేసిన బరువు బాధ్యతను అనిల్ రావిపూడి మోస్తాడా ..?

-

రాజ మౌళి, కొరటాల శివ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రాం నటించిన పటాస్ సినిమా తో దర్శకుడిగా మారి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్స్ ని తీశాడు. అంతేకాదు అనిల్ రావిపూడి తో ఏ హీరో సినిమా చేసిన ఆ సినిమా హిట్ గ్యారెంటి అన్నట్టుగా హీరోలకి లక్కీ డైరెక్టర్ గా మారాడు.

 

అందుకు ఉదాహరణ ఫ్లాపుల్లో ఉన్న రవితేజ కి రాజా ది గ్రేట్ తో మంచి హిట్ ఇచ్చాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన సరిలేరు నీకెవ్వరు కూడా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా సక్సస్ ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్3 ని తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

ఇక ఈ మద్యలో అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తాడన్న వార్తలు వచ్చాయి. రామారావు అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అన్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక తాజాగా అనిల్ రావిపూడి బాలయ్య సినిమా ఏమో గాని బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ ని తెరకి పరిచయం చేసే బాద్యత తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు తగ్గ సన్నాహాల్లో బాలయ్య అనిల్ రావిపూడి ఉన్నట్టు తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version