KGF : “రామ్‌ రాజ్ కాటన్‌” కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా యశ్‌

-

కేజీఎఫ్‌ – 2 గురించి సౌత్‌ ఇండియా ఎంతగా ఎదురు చూస్తుందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్‌ – 1 ఎంత పెద్ద విజయం సంపాదించిందో చూశాం. ఆ సినిమా రికార్డులు తిరగరాసింది. ఒక రకంగా చెప్పాలంటే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. . సినిమాలో ద‌మ్ముంటే క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించింది. య‌ష్‌కు నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ తీస‌సుకొచ్చింది.

ప్రస్తుతం య‌ష్ చాప్టర్ 2లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ మాసం విడుదల కానుంది. ఇలాంటి తరుణంలో కేజీఎఫ్‌ హీరో యష్‌ కు అదిరి పోయే ఆఫర్‌ వచ్చింది. రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాడిసర్‌ గా ఆ కంపెనీ హీరో యశ్‌ ను నియామకం చేసింది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన చేసింది రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీ.

దేశ వ్యాప్తంగా రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీకి ఎంత క్రేజ్‌ ఉందో మనకు తెలిసిందే. ఆ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గించుకోకుండా.. స్టార్‌ హీరో యష్‌ ను బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమించుకుంది రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version