పెళ్లి పెటాకులు కావడానికి కారణం నువ్వే.. కరణ్ పై సమంత షాకింగ్ కామెంట్స్

-

టాలీవుడ్ స్వీట్ కపుల్ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. 2016 లో ఈ జంట వివాహం చేసుకొని ఒకటి కాగా.. తాజాగా నిన్న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. సామ్ చైతూ విడాకులు తీసుకుంటున్నారు అంటూ గత నెల రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా సమంత ముంబైకి మకాం మార్చడంతో విడాకులు పక్కా అంటూ వార్తలు వచ్చాయి.

ఇక ముందు నుంచి వార్తలు వచ్చినట్టుగానే ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే సమంత షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తాజాగా కాఫీ విత్ కరణ్ ప్రోమో విడుదల చేయగా… అందులో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పెళ్లి తర్వాత జీవితం అనుకున్నంత సంతోషంగా ఉండకపోవడానికి కారణం మీరే అంటూ కరణ్ జోహార్ పై సమంత ఫన్నీ కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత జీవితం కవి ఖుషి కభీ ఘమ్ లా ఉంటుందని చూపించారు కానీ… రియాల్టీలో మాత్రం డిఫరెంట్ గా ఉంది. పెళ్లి తర్వాత లైఫ్ కేజిఎఫ్ లా ఉంటుందని పరోక్షంగా తన మ్యారేజ్ లైఫ్ పై కౌంటర్ వేసుకుంది సమంత. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version