ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి ఒంటిమిట్ట కోదండ రాములు స్వామి..ఆంద్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలం రాముల వారికి శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సపరేటు అయ్యాక ఆంద్రుల భద్రాచలం అయ్యింది.ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రం ఏకశిలానగరం అని ప్రసిద్ధి చెందింది..శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు..
ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారు.ముందు గర్భాలయం నిర్మాణం, తర్వాత తూర్పు ముఖ మండపం, మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు. రెండవ శిలాశాసనం ప్రకారం 1558 లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రధం నిర్నించటానికి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు, ప్రహరీ గోడల నిర్మాణానికి వినియోగించాలని తెలిపాడు. విజయనగర చక్రవర్తి సదాశివ రాయల ముఖ్యమంత్రి గుత్తియేరా తిరుమల రాజు కుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందచేసినట్లు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తోంది..ఈ ఆలయం గురించి మాటల్లో, రాత చెప్పలేని ఎన్నో విశేషాలు ఇందులో దాగి ఉన్నాయి.
ఇక్కడ స్వామివారి కళ్యాణం రాత్రి ఎందుకు చేస్తారు?
ప్రపంచంలోని అన్నీ ప్రముఖ దేవాలయాలలో కళ్యాణం పగలు చేస్తారు..కానీ ఇక్కడ మాత్రం రాత్రి చేస్తారు. అలా ఎందుకు చేస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరికి రావడం సహజం.రాత్రే కల్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది..విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కధ ప్రాచుర్యంలో ఉంది..
ఎలా చేరుకోవచ్చు..
*. ఈ ఆలయం కడప-తిరుపతి రహదారిపై ఉంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
*. రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
*. కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
*. తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.
ఎప్పుడైనా కడప వెల్లినప్పుడు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకోండి.. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధలు కూడా తొలగి పోతాయి..
” జై శ్రీరామ్ “