ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో తులసి మొక్కని ఆరాధిస్తూ ఉంటారు. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావించి రోజూ ఆరాధిస్తూ ఉంటారు. తులసి మొక్క పూజలో అన్ని రకాల పూలను ఉపయోగించకూడదు. మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కకి కొన్ని పూలను అస్సలు పెట్టకూడదట. దాని వలన అశుభం కలుగుతుంది. మరి తులసి మొక్కని ఆరాధించేటప్పుడు, తులసి పూజ చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు? తులసికి ఎలాంటి పూలని పెడితే మంచి జరుగుతుంది? ఎలాంటివి పెట్టకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు పసుపు పువ్వులు పెట్టకూడదు.
ఎందుకంటే పసుపు పువ్వులు వేరుతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకని పెట్టకూడదు. అలాగే తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు బిల్వపత్రాన్ని కానీ ఉమ్మెత్త పువ్వులను కానీ పెట్టకూడదు. వీటిని పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. వాడిపోయిన పువ్వులని ఎవరికీ ఇవ్వకూడదు. అలాగే ఏ దేవుడికి సమర్పించకూడదు వాడిపోయిన పూలని పెడితే పాపం తగులుతుంది. వికసించిన పూలను మాత్రమే తులసి మొక్కకు పెట్టాలి.
వాడిన పుష్పాలని తులసికి పెడితే కోరికలు నెరవేరకుండా పోతాయి. అనుకున్న పనులు జరగవు. ఆటంకాలు వస్తాయి. ఎరుపు రంగు పువ్వులని తులసి మొక్కకు పెడితే మంచిది. ఎరుపు రంగు పూలని తులసి మొక్కకు సమర్పించవచ్చు మందారం, గులాబీ, కలువ పూలు వంటి ఎర్రని పూలను సమర్పించవచ్చు. తులసి పూజ చేసేటప్పుడు తాజా స్వచ్ఛమైన పూలను పెట్టాలి. తులసి మొక్కకి ఎండిపోయిన, పసుపు రంగు పూలు, కత్తిరించినవి, పేరు తెలియని మొక్కల పూలని ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి.