పొరపాటున కూడా వీటిని ఎవ్వరికి దానం చెయ్యకండి..

-

కొన్ని వస్తువులు దానం చేస్తే ఉన్న దొషాలు పోయి మంచి జరుగుతుంది. కానీ కొన్నిటిని దానం చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి వెళ్ళి పోతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఏ వస్తువుల దానం చేస్తే పుణ్యం వస్తుందో, ఏ దానం చేస్తే మనిషికి ఇబ్బందులు వస్తాయో గ్రంధాలలో క్షుణ్ణంగా రాసిపెట్టారు. మత విశ్వాసాల ప్రకారం ఎప్పుడు కూడ దానం చేయకూడనివి చాలా ఉన్నాయి.మనకు ఇలాంటి వాటి పై నమ్మకం లేకున్నా కూడా కొన్ని తప్పక నమ్మాలి.

లక్ష్మీ మంచి సంపదకు దేవత గా భావిస్తారు. ఇంట్లో లక్ష్మీ ఉంటే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాం. అలాంటి లక్ష్మీదేవి ఫోటో ఇతరులకు దానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వీడ్కోలు పలికినట్టే. లక్ష్మీదేవి, గణేశుడు చిత్రించిన వెండి నాణేలను ఎప్పుడు ఇతరులకు దానం చేయకూడదు.
సంపన్నులకు ఎప్పుడు పాత్రల దానం చేయకూడదు. ఆ వ్యక్తులకు పాత్రలు దానం చేయడం వల్ల వాళ్ళు ఆ పాత్రలను ఎప్పుడు వాడరు. ఈ కారణంగా విరాళానికి ఎలాంటి ప్రాధాన్యత వుండదు. పాత్రలు దానం చేయాలి అనుకుంటే అవసరమైన వ్యక్తులకే దానం చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో సుఖ, సంతోషాలు కలగాలి అంటే ధార్మిక పుస్తకాలను ఇతరులకు దానం చేయాలి.

అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానంగా పరిగణించారు. పేదవారికి, ఆకలితో వున్నవారికి ఆహారాన్ని ఇవ్వడం మంచి పనిగా చెప్పారు. అలా చేయడం ద్వారా దేవుడు కూడ సంతోషిస్తాడట. అయితే పాత లేదా పాడైన ఆహారాన్ని ఎప్పటికి దానం చేయకూడదు..ఇది అందరూ గుర్థుంచు కోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version