జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మెగా బ్రదర్ నాగబాబుకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబును పంపించేందుకు రంగం సిద్ధం చేసిందట. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన నాగబాబు జనసేన పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.
వీటిలో కచ్చితంగా జనసేన పార్టీకి ఒక పదవి దక్కుతుంది. అయితే ఆ ఎమ్మెల్సీ పదవి కోసం నాగబాబును ఫైనల్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. కాకా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని కూడా చెబుతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఆయనకు మంత్రిమండలిలో అవకాశం వస్తుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.